పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కు పవన్..

Pawan Kalyan Mother: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థతకు గురైనారు.

Update: 2025-06-24 06:05 GMT

పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్ కు పవన్.. 

Pawan Kalyan Mother: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థతకు గురైనారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ విషయం కేబినెట్ సమావేశం ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే పవన్ కల్యాణ్‌కు తెలియడంతో, వెంటనే సమావేశాన్ని మధ్యలో వదిలి ఆస్పత్రి వైపు బయలుదేరినట్టు తెలిసింది.

తల్లి అనారోగ్య వార్త తెలిసిన వెంటనే మెగా అభిమానులు, జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందన్న విషయంలో ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Tags:    

Similar News