రూపాయికే ఇడ్లి, రూపాయికే మైసూర్ బజ్జి.. మూడు రకాల చెట్నీలు కూడా.. ఎక్కడో తెలుసా..?

One Rupee Idly: ఒక్క రూపాయికే ఇడ్లీ. రూపాయికే మైసూర్ బజ్జీ, 5 రూపాయలకే పూరీ...ఏంటి ఇంత చౌవకగా టిఫిన్ ఏంటి అనుకుంటున్నారా..?

Update: 2022-03-24 14:30 GMT

రూపాయికే ఇడ్లి, రూపాయికే మైసూర్ బజ్జి.. మూడు రకాల చెట్నీలు కూడా.. ఎక్కడో తెలుసా..?

One Rupee Idly: ఒక్క రూపాయికే ఇడ్లీ. రూపాయికే మైసూర్ బజ్జీ, 5 రూపాయలకే పూరీ...ఏంటి ఇంత చౌవకగా టిఫిన్ ఏంటి అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నా..ఆయిల్ ధరలు మండిపడుతున్నా..రూపాయికే ఇడ్లీ, రూపాయికే మైసూర్ బజ్జీని అల్పాహారంగా అందిస్తోంది ఓ హోటల్. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది.

10 రూపాయలకే 10 ఇడ్లీలు, 10 రూపాయలకే 10 మైసూర్ బోండాలు, 10 రూపాయలకే రెండు పూరీలు అనగానే మీకు నోరూరుతుందా..? అయితే అలాంటి అతిచౌకగా లభించే ఇడ్లీ, పూరీ, మైసూర్ బజ్జీని తినాలంటే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం రాయభూపాల కొత్తూరు గ్రామానికి వెళ్లి తీరాల్సిందే. రేట్లు తక్కువ కాబట్టి రుచి అంతంత మాత్రమే అనుకుంటే పొరబడ్డట్లే. ధర తక్కువైనా నాణ్యమైన అల్పాహారాన్ని అందిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది ఓ కుటుంబం.

ప్రస్తుతం నిత్యావసరలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటర్ ఆయిల్ ప్యాకెట్ దాదాపు 180 రూపాయలకు పైనే ఉంది. పల్లీలు, గోదుమపండి, మినపప్పు సహా ఇతర నిత్యావసర ధరలన్నీ ప్రస్తుతం మండిపోతున్నాయి. అయినా రూపాయికే ఇడ్లీ, రూపాయికే మైసూర్ బజ్జీ, 5 రూపాయలకే పూరీని అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు చిన్ని రాంబాబు, చిన్ని రాణి దంపతులు.

చిన్ని సత్యం నిలయం. ఈ పేరు వినగానే కొత్తూరు గ్రామ వాసులందరికి రూపాయికి ఇడ్లీ హోటల్ గుర్తుకొస్తుంది. ఉదయం 4 గంటలనుంచే ఇక్కడ క్యూ మొదలవుతుంది. ఉదయం 4 నుంచి మొదలుకొని 10 గంటల వరకు మాత్రమే ఇక్కడ టిఫిన్స్ దొరుకుతాయి. అల్పాహారంలో మూడు రకాల చట్నీలుంటాయి. రుచి, శుచి, నాణ్యతకి ఏమాత్రం డోకా లేదు. అందుకే రాంబాబు, రాణిలా హోటల్‌కు వెళ్లేందుకు కొత్తూరు గ్రామ వాసులే కాకుండా, ఇరుగు పొరుగు గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ క్యూ కడతారు. జేబు నిండా డబ్బులు లేకున్నా ఓ 10 రూపాయిలుంటే చాలు కడుపునిండా అల్పాహారం తిని సంతోషంగా బయటకు వెళుతుండడం ఈ హోటల్ ప్రత్యేకత.

ఒక్క రూపాయికే ఇడ్లీని గత 16 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తూ ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు చిన్ని రాణి దంపతులు. ఈ హోటలే జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్నారు వీరు. వీరికి రాణి తల్లికూడా సహాయం చేస్తుండడం విశేషం. కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తన కుటుంబ పోషణకు మాత్రమే స్వల్ప ఆదాయాన్ని ఆర్జిస్తూ తనను నమ్మి తన హోటల్‌కు వచ్చిన కస్టమర్స్‌కు రుచి, శుచికరమైన, వేడివేడిగా అల్పాహారాన్ని అందివ్వడమే ఒక దివ్యానుభూతిగా భావిస్తున్నామని రాంబాబు,రాణీలు గర్వంగా చెప్తున్నారు. ఓవైపు ధరలు మండిపోతున్నా తనవంతు సాయంగా వీలైనంత కాలం ఇదే ధరలకు అల్పాహారం అందిస్తానని చెప్తున్నారు రాణి రాంబాబులు. 

Full View


Tags:    

Similar News