Nara Lokesh: తగ్గేదే లేదు.. రెడ్‌బుక్‌లో చాప్టర్ 3 ఓపెన్ అవుతుంది..
Nara Lokesh on Red Book: రెడ్ బుక్ మూడో చాప్టర్ ను కూడా తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.
Nara Lokesh: తగ్గేదే లేదు.. రెడ్‌బుక్‌లో చాప్టర్ 3 ఓపెన్ అవుతుంది..
Red Book Chapter 3: రెడ్ బుక్ మూడో చాప్టర్ ను కూడా తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అమెరికా అట్లాంటాలో శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్నిఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రెడ్ బుక్ రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని ఆయన అన్నారు. మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావులు చాలా కష్టపడాలని ఆయన అన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తామన్నారు. యువగళం పాదయాత్రలో తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరులో తాము వ్యవహరించబోమన్నారు. చట్టప్రకారంగానే తాము వ్యవహరిస్తామని చెప్పారు. రెడ్ బుక్ కు జగన్ భయపడుతున్నారనేందుకు గుడ్ బుక్ తీసుకువస్తానని ప్రకటించడమేనని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.