Andhra Pradesh: ఎంపి విజయసాయి పాదయాత్రలో రెచ్చిపోయిన జేబు దొంగలు

Andhra Pradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా చేసిన పాదయాత్రలో జేబు దొంగలు చేతి వాటం ప్రదర్శించారు

Update: 2021-02-24 05:05 GMT

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ india

Andhra Pradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఈ నెల 20 ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టారు. ఈ పాదయాత్రలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. బాధితుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరంతా పాదయాత్రలో చోరీల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారని విచారణ తేలింది. ఈనెల 20న విజయసాయిరెడ్డి పాదయాత్ర సమాచారాన్ని పేపర్లలో తెలుసుకున్న పాత నేరస్థులు 8 నుంచి 10 మంది వరకు తాడేపల్లి, ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. వీరంతా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం వరకు జరిగిన పాదయాత్రలో జనాలతో కలిసి పోయారు.

పాదయాత్రలో పాల్గొన్నవారి జేబుల నుంచి డబ్బును చోరీ చేశారు. జేబు దొంగతనాలు జరిగినట్లుగా ఎయిర్‌పోర్టు, కంచరపాలెం, నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నగరంలోని జేబు దొంగలను పిలిచి ఆరా తీశారు. వీరి ద్వారా ఇతర ప్రాంతాల నుంచి కూడా జేబు దొంగలు వచ్చినట్లు తెలుసుకున్నారు. అల్లిపురం, ఏలూరు, గుంటూరు జిల్లా తాడేపల్లి, కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2.80 లక్షల మేర స్వాధీనం చేసుకున్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News