టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బాబు, లోకేష్, పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ విజయసాయి జగన్‌ను చూసి చంద్రబాబు భయపడుతున్నారని సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేలా జగన్ మంచి పరిపాలన అందిస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
టీడీపీని చంద్రబాబే గొంతు పిసికి చంపేస్తున్నారని ఆరోపించిన విజయసాయి తెలుగుదేశాన్ని బీజేపీకి ధారాదత్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సుజనా, సీఎం రమేష్‌ను బీజేపీలోకి పంపింది చంద్రబాబే అన్నారు. సొంత పుత్రుడు లోకేష్ ఒకచోట ఓడిపోతే దత్తపుత్రుడు పవన్ రెండుచోట్లా ఓడిపోయాడని వీళ్లిద్దరిపై ప్రజలు అసలు నమ్మకమే లేదంటూ సెటైర్లు వేశారు. ఇక, నాయకుడిగా బాబు ఉనికి కోల్పోతున్నారని ఘాటు విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు కేవలం జాతి నాయకుడిగా మారిపోయారని అన్నారు.