లోక్‌సభలో ఏపీ రాజధాని గురించి లేవనెత్తిన గల్లా, అడ్డుతగిలిన వైసీపీ ఎంపీలు

Update: 2020-02-05 12:24 GMT
ఎంపీ గల్లా జయదేవ్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ఏపీ రాజధాని వివాదాన్ని లోక్‌సభలో ప్రస్తావించారు. ఏపీ రాజధాని ఇష్యూ రాష్ట్రానికి కాదని జాతీయ సమస్య అన్నారు. 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారన్న గల్లా ఇఫ్పుడు వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చిందన్నారు. అయితే, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మూడు రాజధానులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు గల్లా జయదేవ్. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పలు పత్రికలు తుగ్లక్‌ నిర్ణయంతో పోల్చాయంటూ వ్యాఖ్యానించారు. దాంతో, గల్లా ప్రసంగానికి వైసీపీ ఎంపీలు అడ్డుతగిలారు. ఇక, స్పీకర్ సీట్లో కూర్చున్న డి.రాజా కూడా గల్లా స్పీచ్ పై అభ్యంతరం తెలిపారు. గల్లా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News