వేరుశెనగ, మొక్కజొన్న కొనుగోళ్లపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ఫైరయ్యారు. మొక్కజొన్న రైతులకు బోనస్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే రైతు భరోసా నగదు జమ చేస్తున్నామని మంత్రి కన్నబాబు ప్రకటించారు.