టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ర్టంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించి.. అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర చేస్తామంటే ఎందుకు వద్దంటామని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని అధోగతి పాలు చేశారని.. చంద్రబాబు చెప్పే మాయమాటలను ఎవరు నమ్ముతారని బొత్స ప్రశ్నించారు.