Nara Lokesh: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదు

Nara Lokesh: అసత్యాలు ప్రచారం చేయడమే వైసీపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Update: 2025-09-23 10:03 GMT

Nara Lokesh: అసత్యాలు ప్రచారం చేయడమే వైసీపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా చెప్పినా, వైసీపీకి అర్థం కావడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని అవమానించిన వాళ్లు ఇప్పుడు గౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... "తల్లిని అవమానిస్తే ఆ బాధ ఏమిటో నేను ప్రత్యక్షంగా చూశాను. మా తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ఆ సంఘటన నుంచి ఆమె కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది" అని భావోద్వేగంగా మాట్లాడారు. తమకు మహిళలను గౌరవించడం నేర్పారని పేర్కొంటూ, ఇప్పటికీ వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ నేతలకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Tags:    

Similar News