Kiran Royal: కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్

Update: 2025-02-10 09:58 GMT

Kiran Royal: కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ ఛీటింగ్ కేసులో లక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి వస్తున్న సమయంలో ఆమెను అరెస్ట్ చేశారు.

లక్ష్మిని ఎస్ వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్ష్మీపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు స్థానిక పోలీసులకు సమర్పించి అక్కడి నుంచి లక్ష్మిని రాజస్థాన్ కు తీసుకెళ్లారు. తిరుపతి నుంచి చెన్నైకు అక్కడి నుంచి రాజస్థాన్ కు తీసుకెళ్లనున్నారు.

కిరణ్ రాయల్ పై  ఆరోపణల నేపథ్యంలో లక్ష్మికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియా ప్రసారం చేసింది.  లక్ష్మి బాధితుడు ఒకరు మీడియాలో ఆమె ఫోటో చూసి రాజస్థాన్ పోలీసులను ఆశ్రయించారు.  దీంతో రాజస్థాన్ పోలీసులు తిరుపతికి వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు.

ఆర్ధిక లావాదేవీలు, ఇతర వివాదాలపై కిరణ్ రాయల్ పై లక్ష్మీ ఆరోపణలు చేశారు.తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు.కిరణ్ రాయల్ తన నుంచి కోటి రూపాయాలు అప్పుగా తీసుకొని ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తన డబ్బులు ఇవ్వాలంటే బెదిరిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ ఆరోపణలతో కిరణ్ రాయల్ ను జనసేన వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ ఆదేశించింది.

Tags:    

Similar News