Breaking News: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా..!

Breaking News: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా..!

Update: 2023-02-16 06:07 GMT

Breaking News: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా..!

Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 23 లేదా 24న కన్నా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. గత కొంతకాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కన్నా. జాతీయ కార్యకర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. రెండు రోజుల క్రితం అమరావతిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటనలో కూడా కన్నా కానరాలేదు. ఇక.. ఇవాళ గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్‌పై ముఖ్య అనుచరులతో చర్చించిన కన్నా.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.

Tags:    

Similar News