Kakani: టీడీపీపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం

Kakani: కృష్ణపట్నం పోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Update: 2024-01-25 08:12 GMT

Kakani: టీడీపీపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం

Kakani: ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి టీడీపీపై ఫైర్ అయ్యారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకనే కృష‌్ణపట్నం పోర్టు తరలిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టులో ఎలాంటి సర్వీసులు రద్దు కాలేదని స్పష్టం చేశారు మంత్రి కాకాణి. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి పెరుగుతోందని.. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తుందని ఓ నివేదిక తెలిపిందన్నారు. పోర్టు వ్యాపారంలో హెచ్చుతగ్గులుంటాయని.. అయినంత మాత్రాన పోర్టు పురోగతికి ఎలాంటి ఢోకా లేదన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

Tags:    

Similar News