Nellore: కోర్టు కేసుల్లో అలసత్వం వద్దు.. తహశీల్దార్లపై జెసి ఆగ్రహం
Nellore: రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Nellore: కోర్టు కేసుల్లో అలసత్వం వద్దు.. తహశీల్దార్లపై జెసి ఆగ్రహం
Nellore: రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సదస్సులో రెవెన్యూ క్లినిక్, పిజిఆర్ఎస్ గ్రీవెన్స్, మ్యూటేషన్లు, చుక్కల భూములు, 22ఎ కేసులు, జీరో ఖాతాలు, రీ సర్వే, పెండింగ్ కోర్టు కేసులు మొదలైన రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. మండలాల వారీగా తహశీల్దార్లతో పెండింగ్ సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
తహశీల్దారు కార్యాలయాల్లో ఒక ప్రణాళికాబద్దంగా కార్యాచరణ రూపొందించుకుని పనిచేస్తే పెండింగ్ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చన్నారు. రెవెన్యూ సమస్యలపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన అమెండ్‌మెంట్ సర్క్యులర్స్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలన్నారు. జిల్లాలో కోర్టు కేసులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని చివరి వరకు వేచి చూడకుండా సకాలంలో తాసిల్దార్లు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు తప్పులను వెంటనే సరి చేయాలన్నారు. రీ సర్వే సమస్యలపై వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కాన్ఫరెన్సులో డిఆర్‌వో విజయ్‌కుమార్, ఆర్డీవోలు అనూష, పావని, ఎలీషా, సర్వే ల్యాండ్ రికార్డుల డిడి నాగశేఖర్, తహశీల్దార్లు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.