Kadambari Jethwani: ప్రభుత్వానికి ధన్యవాదాలు.. నాకు నష్టపరిహారం ఇవ్వాలి..
Kadambari Jethwani: ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనితను కలిశారు ముంబై నటి జత్వాని.
Kadambari Jethwani: ప్రభుత్వానికి ధన్యవాదాలు.. నాకు నష్టపరిహారం ఇవ్వాలి..
Kadambari Jethwani: ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనితను కలిశారు ముంబై నటి జత్వాని. అరగంట పాటు హోంమంత్రితో సమావేశమయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నాపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఆ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకూడదు.. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరాను.
పోలీసులు గతంలో తనపై నమోదు చేసిన కేసును విత్ డ్రా చేసుకోవాలని హోంమంత్రిని కోరినట్లు చెప్పారు. తన కుటుంబం వ్యవహారంలో పోలీసులు దారుణంగా వ్యవహరించిన తీరును హోంమంత్రికి చెప్పారన్నారు జత్వాని. తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తనకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్ట పరిహారాన్ని కోరారు.