ఏపీ రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీనివేదిక గందరగోళంగా ఉందన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ.. రాజధాని మూడు చోట్ల ఉండటం మంచి ఆలోచన కాదన్నారు. పరిపాలన మొత్తం ఒక చోట నుంచి సాగితేనే అభివృద్ధిసాధ్యమన్నారు.. రాజధాని అంశం రెండు కులాల మధ్య పోరు కాదని, తాను రాజధాని వికేంద్రీకరణ అనలేదని జేపీ చెబుతున్నారు.