జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ చీఫ్ పవన్‌కల్యాణ్ ఏ కార్యక్రమం చేసినా ఆ పది మంది మాత్రమే వస్తారని వ్యాఖ్యానించారు. ప్రతి చిన్న విషయానికి ధర్నాలు, సభలు సరికాదన్నారు. ముందు ముందు పవన్‌కల్యాణ్ సభలకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. రాపాక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగిన సందర్భంలో కూడా జనసేన ఎమ్మెల్యే రాపాక జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. ఆంగ్ల మాధ్యమంపై జనసేన అధినేత అనుసరిస్తున్న వైఖరికి, జనసేన ఎమ్మెల్యే అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో రాపాక త్వరలో పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది.