PV Sunil Kumar: రఘురామను కస్టడీలో హింసించిన కేసు.. విచారణకు హాజరైన సునీల్‌కుమార్
PV Sunil Kumar: కస్టోడియల్ టార్చర్ కేసు విచారణకు ఏ-1 నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ హాజరయ్యారు.
PV Sunil Kumar: కస్టోడియల్ టార్చర్ కేసు విచారణకు ఏ-1 నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ హాజరయ్యారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ లో హింసించిన కేసులో పీవీ సునీల్ కుమార్ విచారణకు హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేశారు. విచారణాధికారిగా విజయంగరం జిల్లా ఎస్పీ దామోదర్ నియామకం అయ్యారు. డిసెంబరు 4న విచారణకు రావాలని గత నెల 26న తొలి నోటీసు ఇవ్వగా.. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందున గడువు కావాలని సునీల్‌కుమార్ కోరారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న విచారణకు రావాలని ఈ నెల 6న రెండోసారి నోటీసు ఇచ్చారు. దీంతో నేడు ఆయన విచారణకు హాజరయ్యారు.