Hafeez Khan: మాజీ ఎమ్మెల్యే‌ హఫీజ్ ఖాన్‌‌పై మహిళ ఫిర్యాదు.. మహిళా కమిషన్ సీరియస్, కీలక ఆదేశాలు

Hafeez Khan: కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఓ మహిళ.

Update: 2025-12-15 09:16 GMT

Hafeez Khan: కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. కార్పొరేషన్ టికెట్ ఇప్పిస్తానంటూ మూడు కోట్లు తీసుకున్నారని.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే హత్యాయత్నానికి పాల్పడుతున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తనను హైదరాబాదు తీసుకెళ్లి నగ్నంగా పూజల్లో పాల్గొనాలని బలవంతం చేశాడనీ, లైంగిక దాడికి యత్నించాడంటూ ఫిర్యాదు చేసింది. హఫీజ్ ఖాన్ నుంచి రక్షణ కల్పించాలని కోరింది. మహిళ ఫిర్యాదుపై మహిళా కమిషన్ స్పందించింది. మహిళ ఆరోపణలపై నివేదిక సమర్పించాలంటూ మహిళా కమిషన్ కార్యదర్శి కర్నూలు జిల్లా ఎస్పీని ఆదేశించారు. 

Tags:    

Similar News