Vande Bharat: నరసాపురం-చెన్నై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

Vande Bharat: నరసాపురం-చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు నేడు (డిసెంబర్ 15, 2025) నరసాపురం స్టేషన్ నుంచి లాంఛనంగా ప్రారంభమైంది.

Update: 2025-12-15 10:18 GMT

Vande Bharat: నరసాపురం-చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు నేడు (డిసెంబర్ 15, 2025) నరసాపురం స్టేషన్ నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ గారు పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి, ఇతర రైల్వే మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

వాస్తవానికి, ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇంతకుముందు చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తుండేది. ఇటీవల, రైల్వే బోర్డు ఈ సర్వీసును నరసాపురం వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చెన్నై సెంట్రల్‌లో ఉదయం 5:30 గంటలకు బయలుదేరే ఈ రైలు...రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 11:40 గంటలకు చేరుకుంటుంది.

ఇకపై, విజయవాడ నుంచి ఈ రైలు గుడివాడ, భీమవరం మీదుగా ప్రయాణించి నరసాపురం వరకు తన సేవలను అందించనుంది. ఈ పొడిగింపు వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం ప్రాంతాల ప్రజలకు చెన్నై వంటి మెట్రో నగరానికి వేగవంతమైన, ఆధునిక రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది.

Tags:    

Similar News