Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దగ్గర ఉద్రిక్తత

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దగ్గర ఉద్రిక్తత సీఎండీ ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగుల ఆందోళన సీఎండీ నిర్ణయాలతో రెగ్యులర్‌తో పాటు..

Update: 2025-12-15 06:17 GMT

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దగ్గర ఉద్రిక్తత

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎండీ ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీఎండీ నిర్ణయాలతో రెగ్యులర్‌తో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా భారీగా నష్టపోతున్నారని ఆరోపిస్తూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో పరిపాలన విభాగం దగ్గర ధర్నా చేపట్టారు. జీతం మా కష్టార్జితం - మా హక్కు.. ఉత్పత్తికి జీతాలకు ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్‌ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రా మెటీరియల్‌ ఇవ్వండి.. ఉత్పత్తి చేస్తామంటున్న ఉక్కు కార్మికులు.. బకాయి వేతనాలు.. పూర్తి వేతనాలు చెల్లించాలని పట్టు బడుతున్నారు. సెయిల్‌లో విలీనంతో పాటు నిలిపివేసిన సౌకర్యాలు పునరిద్దరించాలని ఆందోళనకు దిగారు. 

Tags:    

Similar News