ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన ఫోకస్
Jana Sena: ఇవాళ జనసేన విస్తృతస్థాయి సమావేశం
ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన ఫోకస్
Jana Sena: ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన ఫోకస్ పెంచింది. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా నగర అధ్యక్షులు హాజరవుతారు. జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు టీడీపీతో సమన్వయం చేసుకొని చేపట్టాల్సిన కార్యక్రమాలు.. ఓటర్ల జాబితా పరిశీలన అంశాలపై జనసేనాని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.