కల్కీ కోటలో విస్తుపోయే నిజాలు

చిత్తూరు జిల్లా వరదయ్య పాళెంలోని కల్కి ఆశ్రమమైన ఏకం ఆలయంలో ఐటీ శాఖ దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. నగదు దాచే కీలక ప్రదేశాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

Update: 2019-10-18 05:36 GMT

చిత్తూరు జిల్లా వరదయ్య పాళెంలోని కల్కి ఆశ్రమమైన ఏకం ఆలయంలో ఐటీ శాఖ దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. నగదు దాచే కీలక ప్రదేశాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కల్కి ఆశ్రమంలో గుట్టలు నగదు లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రదేశాన్ని తనిఖీ చేసిన అధికారులు నిర్ఘాంతపోయినట్లు తెలిసింది. అందులో అధిక సంఖ్యలో బంగారు బిస్కెట్లు, సుమారు 10కోట్ల వరకు స్వదేశీ విదేశీ నగదు దొరికినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు ఏమీ చెప్పడం లేదు.

తమిళనాడు ఐటీ శాఖ అధికారులు బత్తులవల్లం, ఉబ్బలమడుగు సమీపంలో ఉన్న ఏకం ఆలయంలో, వసతి గృహాలలో మకాం వేశారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఒక్కరిని బయటకి వెళ్లనీయడం లేదు. బయటి వారిని కూడా లోపలికి అనుమతించక ఆశ్రమాన్ని దిగ్భందించారు.

ప్రధాన నిర్వాహకుడైన లోకేష్ దాసాజీ, శ్రీనివాస దాసాజీలను అధికారులు వేర్వేరుగా విచారించి ప్రశ్నలవర్షం కురిపించారు. గత 25ఏళ్లలో ట్రస్టు పేర్లను తరచు మారుస్తుండటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రస్టు పేరిట వచ్చిన నిదులు , వాటితో ఏఏ ఆస్తులు ఆర్జించారు..? నిధులు దేనికి మళ్లించారు. ఎక్కడెకక్కడ భూములున్నాయనే విషయమై ఆరా తీసారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News