ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి

Update: 2019-12-13 07:10 GMT

మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏపీ దిశ యాక్ట్‌ అసెంబ్లీ ముందుకు వచ్చింది. హౌస్‌లో హోంమంత్రి సుచరిత బిల్లును ప్రవేశపెట్టారు.

ఏపీలో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష - ఎవరైనా మహిళలపై చెయ్యి వేస్తే పడుతుంది కఠిన శిక్ష అని వ్యాఖ్యానించారు. ఈ చట్టంతో ఏదైనా నేరం జరిగితే, నేరస్తులు నిర్భయంగా సమాజంలో తిరిగే పరిస్థితి ఉండదని, 14 రోజుల్లో విచారణ పూర్తయి, 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా, ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బిల్లని అన్నారు.

Tags:    

Similar News