Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి గుండెపోటు
విజయవాడ రమేష్ హాస్పిటల్‌కు తరలింపు అత్యవసర శస్త్ర చికిత్సతో తప్పిన ప్రాణాపాయం ప్రస్తుతం నిలకడగా బచ్చుల అర్జునుడు ఆరోగ్యం
బచ్చుల అర్జునుడు (ఫైల్ ఫోటో)
Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను విజయవాడ రమేష్ హాస్పిటల్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. అర్జునుడుకి వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స అందించటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం బచ్చుల అర్జునుడు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.