లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయింపు

మండల పరిధిలోని వెంకటాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా ఇళ్ళ స్థలాలను కేటాయించినట్లు తహసీల్దార్ స్వర్ణలత పేర్కొన్నారు.

Update: 2020-03-05 11:39 GMT

ఓబులదేవరచెరువు: మండల పరిధిలోని వెంకటాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా ఇళ్ళ స్థలాలను కేటాయించినట్లు తహసీల్దార్ స్వర్ణలత పేర్కొన్నారు. నల్లగుట్ట పల్లి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల సమక్షంలో గుర్తించిన 16 మందికి లాటరీ పద్ధతిలో స్థలాలను కేటాయించినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైయస్సార్ గృహ నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు మండల వ్యాప్తంగా లాటరీ పద్ధతిలో స్థలాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నటరాజు, హౌసింగ్ ఏఈ సంపత్ కుమార్ ఆర్ఐలు వెంకటరెడ్డి, నాగేంద్ర, వీఆర్వో బాలకృష్ణ గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు


Tags:    

Similar News