Undavalli Arunkumar Tests Positive:ఏపీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి‌కి క‌రోనా పాజిటివ్‌

Undavalli Arunkumar Tests Positive: ఏపీ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండే వీఐపీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు.

Update: 2020-08-26 17:18 GMT

ఉండవెల్లి అరుణ్ కు కరోనా 

Undavalli Arunkumar Tests Positive: ఏపీ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండే వీఐపీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఏపీలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు, అధికారులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చేరిపోయారు. అనేక అంశాలపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ఉండవల్లి.. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదు. అయితే రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేసుకోగా.. కోవిడ్ సోకిన‌ట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో రాజ‌మండ్రిలోని త‌న నివాసంలో హోం ఐసోలేష‌న్‌కి వెళ్లిపోయారు ఉండ‌వ‌ల్లి. ఇక గ‌త వారం రోజులుగా త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

ఇక రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 1528 కేసులు నమోదయ్యాయి. 11 మంది వైరస్ బారిన చనిపోయారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 53567కు చేరుకోగా.. ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 354కు చేరింది. ఆంధ్ర ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,82,469కి చేరుకోగా, ఇప్ప‌టివ‌ర‌కూ 3,541 మంది క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు.  

Tags:    

Similar News