23 Punjab MLAs Test Positive: ఆ రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా

23 Punjab MLAs Test Covid Positive Before Assembly Session Begins
23 Punjab MLAs Test Positive: వర్షకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్దమవుతున్న పంజాబ్ లోని అమరీందర్ సింగ్ సర్కార్ కు షాక్ తగిలింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న 117 మంది ఎమ్మెల్యేలకు
23 Punjab MLAs Test Positive: వర్షకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్దమవుతున్న పంజాబ్ లోని అమరీందర్ సింగ్ సర్కార్ కు షాక్ తగిలింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న 117 మంది ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 23 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో సీఎం కెప్టెన్ అమరేంద్ర సింగ్ అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో సభను ఎలా నిర్వహిస్తామని ఆయన అంటున్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బీజేపీయేతర ఏడు రాష్ట్రాల సీఎంల ఆన్‌లైన్ సమావేశంలో సీఎం అమరీందర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంత భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే.. ఇక సాధారణ ప్రజల సంగతిని ఊహించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు.
కోవిడ్ బారిన పడిన పంజాబ్ మంత్రులు
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి- త్రిప్త్ రాజేందర్ బజ్వా, సహకార శాఖ మంత్రి- సుఖ్‌జిందర్ సింగ్ రాంధ్వా, రెవెన్యూ మంత్రి- గుర్‌ప్రీత్ కంగర్, పరిశ్రమల శాఖా మంత్రి- శ్యామ్ సుందర్ అరోరా, వీరితో పాటు విధాన సభ స్పీకర్ అజైబ్ సింగ్ భాటీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పర్గాత్ సింగ్, మదన్‌లాల్ జలాల్‌పూర్, హరిదయాళ్ కాంబోజ్‌లకు కరోనా సోకింది.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మంజీత్ సింగ్ బిలాస్‌పూర్, కుల్వంత్ సింగ్ పండోరిలకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆప్ రెబల్ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్‌సాహియా కూడా కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన మన్‌ప్రీత్ సింగ్ అయాలీ, కన్వర్‌జిత్ సింగ్ రోజీ బర్కందీ, లఖ్‌బీర్ సింగ్ లోధినాంగల్, హరీందర్ పాల్ సింగ్ చందుమజ్రా, గుర్‌ప్రతాప్ సింగ్ వడాలాలకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేల్లో ఎంత మంది ప్రస్తుతం కరోనాతో బాధ పడుతున్నారనే విషయం గురువారం వెల్లడి కానుందని స్పీకర్ రాణా కేపీ సింగ్ తెలిపారు. ఇక పంజాబ్‌లో ఇప్పటివరకు 44577 కేసులు నమోదయ్యాయి. వీరిలో 29145 మంది వైరస్ నుంచి కోలుకోగా, 1178 మంది కరోనా కారణంగా చనిపోయారు.
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ
11 Aug 2022 4:00 PM GMT'బింబిసార' సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్
11 Aug 2022 3:45 PM GMTCorn Benefits: మొక్కజొన్న ఎనర్జిటిక్ ఫుడ్.. ఎలా తినాలంటే..?
11 Aug 2022 3:30 PM GMTసంపన్నులకు మాఫీలు, పేదోడిపై పన్నులు.. మోడీ సర్కార్‌పై కేజ్రీవాల్...
11 Aug 2022 3:15 PM GMTSamuthirakani: సముద్రఖని దర్శకత్వంలో నితిన్
11 Aug 2022 3:00 PM GMT