రాజధానిపై నేడే తుది నివేదిక?
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ..
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ.. నేడు సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించే అవకాశముంది. ఈ నేపథ్యంలో నివేదిక ఏం పొందుపరిచారన్న దానిపై ఏపీ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
రాజధానిపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై విపక్షాలు, రాజధాని రైతులు భగ్గుమంటున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్‌తో జీఎన్ రావు కమిటీ భేటీ కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3.30కి సీఎంతో సమావేశం కానున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ, నేడు సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించే అవకాశముంది. ఈ నేపథ్యంలో నివేదిక ఏం పొందుపరిచారన్న దానిపై ఏపీ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
రెండు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ ఏర్పాటయ్యే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్ చెప్పిన ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌పై తీవ్ర దుమారం రేగింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో పాటు రాజధాని రైతులు జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల ప్రసక్తే లేదని... అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో జగన్ చెప్పిన మూడు రాజధానులకు జీఎన్ రావు కమిటీ నివేదిక అనుకూలంగా ఉంటుందా? లేదంటే అమరావతి వైపు మొగ్గు చూపుతుందా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. కమిటీ సమర్పించే ఈ నివేదికతో ఏపీ రాజధానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు జీఎన్ రావు కమిటీ సమర్పించే నివేదికలో ఏముందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.