సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డుప్రమాదం

* అక్కడికక్కడే ఐదుగురు మృతి.. మరో 15 మందికి తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Update: 2022-11-13 05:37 GMT

సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డుప్రమాదం

Road Accident: సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతులు మారగోని కోటయ్య, చింతకాయల ఉదయ్‌ లోకేష్‌, చింతకాయల ప్రమీల, తన్నీరు ప్రమీల, గండు జ్యోతిగా గుర్తించారు.

మృతులంతా మృతులు మునగాలకు చెందినవారు కాగా అయ్యప్ప పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టి 50 మీటర్ల దూరం వరకు లారీ ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

Similar News