APSRTC: అది ఫేక్‌ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి ఎటువంటి ప్రకటన చేయలేదు..

Fact Check on APSRTC Jobs: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

Update: 2023-02-22 06:47 GMT

APSRTC: అది ఫేక్‌ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి ఎటువంటి ప్రకటన చేయలేదు..

Fact Check on APSRTC Jobs: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది APSRTC. తాము ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే.. APSRTCలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో APSRTC వెబ్ సైట్ డొమైన్ ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్‌ చేస్తామని స్పష్టం చేసింది.



 

 


Tags:    

Similar News