Perni Nani: "తప్ప తాగి అసెంబ్లీకి వచ్చారు".. బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని కౌంటర్
Perni Nani: బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. తప్పతాగేసి అసెంబ్లీకి వచ్చారంటూ బాలకృష్ణపై మండిపడ్డారు.
Perni Nani: బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. తప్పతాగేసి అసెంబ్లీకి వచ్చారంటూ బాలకృష్ణపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అసెంబ్లీలో ఉంటే.. రాబోయే రోజుల్లో గేటు దగ్గర బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయాలన్నారు నాని. పవన్ కల్యాణ్‌కు హోదా, మర్యాద ఇవ్వడం చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆరోజు బాలకృష్ణతో తాను ఫోన్‌లో మాట్లాడానన్న నాని.. మాట్లాడలేదని బాలకృష్ణ తన తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ చేశారు.