Vijayawada: డీఎస్పీ, సీఐలను అభినందించిన జిల్లా కలెక్టర్
ఈనెల 26 వ తేదీన రాత్రి నూజివీడులో అత్యాచారం కేసులో రికార్డ్ సమయంలో 24 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు పనితీరు ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు.
విజయవాడ: ఈనెల 26 వ తేదీన రాత్రి నూజివీడులో అత్యాచారం కేసులో రికార్డ్ సమయంలో 24 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు పనితీరు ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు. విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు, పట్టణ సీఐ పి. రామచంద్రరావు లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రత్యేకంగా అభినందించారు. చిన్న పిల్లపై అత్యాచార ఘటన అమాననీయ సంఘటన అన్నారు. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
ఇదే స్ఫూర్తితో నూజివీడు డివిజన్ లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు కలెక్టర్. ముఖ్యంగా రాత్రి సమయాలలో గస్తీని మరింత పెంచాలని కలెక్టర్ ఇంతియాజ్ డీఎస్పీ బి.శ్రీనివాసులును ఆదేశించారు. పోలీసు సిబ్బందిని మరింత అప్రమత్తం చేసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాలలో రాత్రి సమయాలలో పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.