తిరుమలలో విషాదం.. పాల లారీ కిందపడి భక్తుడు ఆత్మహత్య

Update: 2019-12-13 09:31 GMT
తిరుమల

ఏం కష్టమొచ్చిందో ఏమో గానీ తిరుమలలో పాల లారీ చక్రాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున లారీ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. లారీ వెనుక చక్రాలు అతడి పై నుంచి పోవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

తిరుమలో తెల్లవారుజామున పాలతో వెళ్తున్న లారీ చక్రాల కిందపడి ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ముందు వెళ్తున్న లారీ కిందపడి సూసైడ్‌ చేసుకున్నాడు. భక్తుడిపై నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భక్తుడి పేరు, చిరునామా సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే అతడు లారీ కిందపడి ఆత్మహత్మకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News