మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఏరియల్ సర్వే
మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఏరియల్ సర్వే
మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అటవీ ప్రాంతంలోని కొంత భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఏరియల్ సర్వేలో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఆయన వీడియో తీశారు.
ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్. ఆక్రమణలతో మాజీమంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నట్టు పవన్ చెప్పారు.
ఆక్రమణలపై సీఎం చంద్రబాబు, కేబినెట్‌కు వివరించిన పవన్.. ఈ ఆక్రమణలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. అటవీ భూములను ఆక్రమించిన వారి పేర్లు వెబ్‌సైట్‌లో పెట్టాలని సూచించారు. విజిలెన్స్ నివేదిక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కల్యాణ్.