Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం: దక్షిణ మధ్య రైల్వే సేవలకు అంతరాయం, 127 రైళ్లు రద్దు
Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం: దక్షిణ మధ్య రైల్వే సేవలకు అంతరాయం, 127 రైళ్లు రద్దు
Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరియు ట్రాక్‌లపై నీరు చేరడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి కారణాల వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు.
మొత్తం 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. అదనంగా 14 రైళ్లను దారి మళ్లించారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ మరియు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ వంటి కీలకమైన సర్వీసులు రద్దయ్యాయి.
వర్షాల తీవ్రత కారణంగా పలు రైల్వే స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోయాయి.మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ మరియు డోర్నకల్ వద్ద గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. కృష్ణా జిల్లాలోని కొండపల్లి వద్ద సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది.
ప్రయాణికులు తమ రైలు ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం రైల్వే అధికారులను సంప్రదించాలని SCR సూచించింది. ట్రాక్‌లను పునరుద్ధరించేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి.