జనవరి 15 తర్వాత కరోనా సెకండ్ వేవ్..

ఏపీలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి సగటున రోజూ 600 కేసులు నమోదవుతున్నాయి. ఒక దశలో రోజుకు 10 వేల కేసులు కూడా నమోదైన సందర్భాలున్నాయి.

Update: 2020-12-13 06:30 GMT

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము. జనజీవనం దాదాపు మామూలు పరిస్థితికి వచ్చింది. అయితే కరోనా ముప్పు మాత్రం ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.

ఏపీలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి సగటున రోజూ 600 కేసులు నమోదవుతున్నాయి. ఒక దశలో రోజుకు 10 వేల కేసులు కూడా నమోదైన సందర్భాలున్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా అంచనా వేసింది.

చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని నివేదికలో స్పష్టం చేసింది. జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది.

Tags:    

Similar News