Corona Effect on Private Travels: భారీ నష్టాల్లో ప్రైవేటు ట్రావెల్స్

Corona Effect on Private Travels: వ్యవస్థ అంతా అల్ల కల్లోలంగా మారిపోయింది. ప్రైవేటు ట్రావెల్స్ రంగం మొత్తం కుదేలయింది.

Update: 2020-09-01 15:52 GMT

Corona Effect on Private Travels: వ్యవస్థ అంతా అల్ల కల్లోలంగా మారిపోయింది. ప్రైవేటు ట్రావెల్స్ రంగం మొత్తం కుదేలయింది. పరిస్తితులు ఎప్పుడు మారుతాయో తేలీదు, కరోనా భయం ఎప్పుడు తెరుతుందో అసలే తెలీదు. ట్రావెల్స్ రంగాన్ని నుమ్ముకుని జీవనం సాగిస్తున్నవారంతా ఇప్పుడు రోడ్డు పాలయ్యయారు. లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినా.. రవాణా వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు.

ఒకప్పుడు విజయవాడ కేంద్రంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణా మధ్య పరుగులు పెట్టిన బస్సులు ఇప్పుడు అనుమతులు ఇచ్చినా బయటకు తీయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐదు నెలలుగా బస్సులు గ్యరేజీకే పరిమితం కావటంతో టైర్లు భూమిలోకి దిగబదిపోయాయి. బ్యాటరీలు డౌన్ అయిపోయాయి. బస్సు లో దుర్వాసన అలుముకుంది. ఇప్పుడు వీటన్నిటిని సరిచేయాలంటే ఏంతో వెయప్రయాసలు తప్పనిసరి. అంతే కాదు, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి వారు అడిగిన మేరా జీతాలు ఇవ్వలేని దుస్థితి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి బ్రతుకులు ప్రస్నార్ధకరంగా మారాయి. వారిని ఆదుకొనే వారే లేరా అంటూ చింతిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితులలో బస్సులు బయటకు తీయాలంటే.. ఏపీ వారకు ఒక్కో బస్సుకు లక్షన్నర వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఐదు, ఆరు బస్సులు ఉన్నవారు లక్షల్లో పన్నులు కట్టాలి. జనాలు లేరు, ఎక్కడా పరిస్థితులు చక్కబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నడిపే అవకాశాలు లేనే లేవని నిర్వాహకులు అంటున్నారు. ఐదు నెలలుగా మూలన పడ్డ బస్సులను బయటకు తెయాలంటే క్రేన్ సాయంతో లగాల్సిందే అని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే రంగంపై ఆధారపడి జీవిస్తున్న క్రింది స్థాయి ఉద్ద్యోగులు, ఇతర సిబ్బంది పరిస్థితి గోరంగా ఉందని చెపుతున్నారు.  

Tags:    

Similar News