చిత్తూరు : అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Update: 2019-11-21 12:47 GMT

వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అధ్యక్షత వహించినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు ఇది గొప్ప ఏడాదిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పోస్టుల నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పుడు తాజాగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విభాగం చిత్తూరులో అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడి హెల్పర్స్ పోస్టులకు అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 21 నుండి తేదీ నుంచి నవంబర్ 30 వరకు అధికారిక వెబ్‌సైట్ www.chittoor.ap.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులలో 343 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వయస్సు

01.07.2019 వరకు 21 నుంచి 35 ఏళ‌్ల వయస్సు గలవారు అర్హులు.

విద్యార్హతలు

పదవతరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Tags:    

Similar News