4 ఏళ్ల వయసులో తప్పిపోయింది .. 15 ఏళ్ల తర్వాత దొరికింది

శ్రీకాకుళం జిల్లా వింత సంఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల తప్పిపోయిన ఓ అమ్మాయి 15 ఏళ్ల తర్వాత మళ్ళీ తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

Update: 2019-12-08 05:43 GMT
భవాని

శ్రీకాకుళం జిల్లా వింత సంఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల తప్పిపోయిన ఓ అమ్మాయి 15 ఏళ్ల తర్వాత మళ్ళీ తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మాధవరావు, వరలక్ష్మీ దంపతులు జీవనోపాధి కోసం గతంలో శ్రీకాకుళం నుంచి హైదరాబాదు కి వచ్చారు. ఆ సమయంలో నాలుగున్నరేళ్ల ఉన్న వారి కుమార్తె భవాని తప్పిపోయింది.

ఈ క్రమంలో ఓ ఇంటి వద్ద జయరాణి అనే మహిళకి ఆ బాలిక కనిపించింది. ఆ బాలిక గురించి చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీనితో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ ఎవరైనా వస్తే తనకు తెలియజేయమని చెప్పింది. కానీ ఎన్నాళ్ళకు ఎవరు రాకపోవడంతో జయరాణి తన ఇద్దరు కూతుళ్ళతో పాటు భవానిని తీసుకొని హైదరాబాదు నుంచి విజయవాడకి వెళ్ళిపోయింది. అక్కడ తన కన్న కూతుళ్లను చదవించకపోయినా భవానీని ఇంటర్మీడియట్ వరకు చదివించింది.

ఇక పడమటలంక లోని వంశీధర్‌ అనే వ్యాపారి నివాసంలో జయరాణి పనిచేస్తుంది. తాను పనిచేసే ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో జయరాణి వంశీధర్‌ దంపతులకి భవానినీ పరిచయం చేసింది. భవానీది చిన్నవయసు కావడంతో ఆమె గురించి వంశీ ఆరా తీశారు. తనకు నాలుగున్నరేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయానని తెలిపింది. తనకు గుర్తు ఉన్నంతవరకు కుటుంబసభ్యుల వివరాలను తెలిపింది.

భవానీ చెప్పిన వివరాల ఆధారంగా వంశీ ఫేస్‌బుక్‌‌లో పోస్ట్‌ చేశారు. దీనితో ఫేస్ బుక్ లో తన అన్నయ్య దివ్యసంతోష్ ని గుర్తుపట్టింది భవాని . వీడియో కాల్ లో తన అన్నయ్య, తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన భవానికి సంతోషానికి హద్దులు లేవు.

ఒక పక్కా కన్నవాళ్ళను కలుసుకోబోతున్నానని ఆనందంగానే ఉన్నా మరో పక్కా తనని పెంచి పెద్దచేసిన తల్లిని వదిలి వెళ్లాలంటే కలిగే బాధ మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కానీ తన వారి దగ్గరికి ఒకసారి వెళ్లిరావాలని అనిపిస్తుందని భవాని చెపుతుంది.  

Tags:    

Similar News