Chintapalle: స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: బీజేపీ

రానున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి శాయశక్తుల కృషి చేయాలని మధూకర్ జీ.పిలుపునిచ్చారు.

Update: 2020-03-05 11:18 GMT

చింతపల్లి: రానున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి శాయశక్తుల కృషి చేయాలని మధూకర్ జీ.పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతపల్లి గిరిజన ఉద్యోగుల భవనం వద్ద చింతపల్లి బీజేపీ మండల అధ్యక్షుల జైతి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కురుసా మహేశ్వర్రావు అధ్యక్షతన బీజేపీ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మధుకర్ జీ మాట్లాడుతూ... బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ అని, వైసీపీ, టీడీపీ లాగా కుల, కుటుంబ పార్టీ కాదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో దాదాపు 90 శాతం కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులేనని ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు. ఏజెన్సీలో బీజేపీపై కమ్యూనిస్టుల చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు.

ప్రస్తుతం ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయిన ఉన్నారని, ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ఈ అవకాశాన్ని స్థానిక నాయకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లోకుల గాంధీ, పైడి వేణు, గోపాలం, పాంగి రాజారావు, కురుసా రాజారావు, కూడా కృష్ణరావు, వంతల రామచందర్, జనసేన నాయకులు వంపూరు గంగులయ్య, పాడేరు అసెంబ్లీ ఐదు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News