Chejerla: కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్త వహించండి
కరోనా వైరస్ ఒక అంటు వ్యాధి అని, దీనిని నివారించేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రమీల రాజకుమారి తెలిపారు.
చేజర్ల: కరోనా వైరస్ ఒక అంటు వ్యాధి అని, దీనిని నివారించేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రమీల రాజకుమారి తెలిపారు. చేజర్ల మండల కేంద్రంలోని గిరిజన కాలని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలోనూ విద్యార్థులకు, కాలనీవాసులకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో కానీ, యాంటీసెప్టిక్ లోషన్ తో 20 నిమిషాల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.
జనసంద్రంలోకి వీలైనంత వరకు దూరంగా ఉండాలని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించి వెళ్లాలని తెలిపారు. అంతేకాకుండా కరచాలనంతో కూడా కరుణ వైరస్ సోకే అవకాశం ఉందని ఆమె తెలిపారు. విద్యార్థులకు ఐరన్ మాత్రలు మింగిచారు. ఐరన్ లోపాల వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.