AP Government: సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AP Government: సంగం డెయిరీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యాన్ని మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2021-04-27 08:34 GMT

AP Government: సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AP Government: సంగం డెయిరీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యాన్ని మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డెయిరీ యాజమాన్యాన్ని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. అదేవిధంగా సంగం పాల ఉత్పత్తిదారుల కంపెనీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఇక సంగం డెయిరీ స్వాధీనానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం సంగం రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకూడదనే జీవో జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అలాగే ఐదు రోజులుగా సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే డెయిరీ వ్యవహారాలపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనా విచారణ కొనసాగుతోంది.

Tags:    

Similar News