పీసీబీ ఛైర్మన్‌పై ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపణలు.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్!

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్యపై ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపణలు చేశారు. ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

Update: 2025-09-19 08:03 GMT

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ కృష్ణయ్యపై ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపణలు చేశారు. ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు. దీనిపై ప్రతిస్పందించిన బోండా ఉమా.. ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్‌లు పంపితే.. ఇలాంటి ఎమ్మెల్యేలను చాలా మందిని చూశామని PCB ఛైర్మన్ కృష్ణయ్య అంటున్నారని.. లెటర్‌తో పనికాకపోతే.. నేరుగా దగ్గరకు వెళ్తే.. తనకు పవన్ కళ్యాణ్ చెప్పాలి.. ఆయన బిజీగా ఉన్నారని.. సాకులు చెబుతున్నారని బోండా ఉమా అసహనం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణయ్య లాంటి వాళ్లను సరిదిద్దాలి అంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. 

బోండా ఉమా ఆరోపణలకు పవన్ కళ్యాణ్ బదులిస్తూ, తాను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు. "పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజల కంటే పరిశ్రమలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది. కృష్ణయ్య ఛైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, "ఒక్క రాంకీ, అయోధ్య రామిరెడ్డిపైనే చర్యలు తీసుకుంటే సరిపోదు. అలా చేయడం ద్వారా గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏముంటుంది?" అని ఆయన ప్రశ్నించారు. కేవలం రాంకీ మాత్రమే కాకుండా, డెల్టా పేపర్, ఆక్వా కంపెనీలు వంటి పెద్ద సంఖ్యలో కాలుష్యం సృష్టిస్తున్న సంస్థలు ఉన్నాయని పవన్ అన్నారు. "పారిశ్రామికవేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు" అని ఆయన హితవు పలికారు.

పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవసరమైన నిధులు కూడా ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేవని, ఇది అందరూ కలిసి కలెక్టివ్‌గా చేయాల్సిన బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో పీసీబీ ఛైర్మన్ పీ. కృష్ణయ్య అధికారుల గ్యాలరీలోనే ఉండడం గమనార్హం.

Tags:    

Similar News