Jagan: చంద్రబాబు ఉంటే బాగుండేది.. కుప్పం ఎఫెక్ట్ పడిందని మావాళ్లు అంటున్నారు
Jagan: బీఏసీ సమావేశానికి చంద్రబాబు ఎందుకు రాలేదని సీఎం జగన్ నిలదీశారు.
Jagan: చంద్రబాబు ఉంటే బాగుండేది.. కుప్పం ఎఫెక్ట్ పడిందని మావాళ్లు అంటున్నారు
Jagan: బీఏసీ సమావేశానికి చంద్రబాబు ఎందుకు రాలేదని సీఎం జగన్ నిలదీశారు. బీఏసీని కొంత ఆలస్యం ప్రారంభించినా చంద్రబాబు రాలేకపోయారని జగన్ అన్నారు. కుప్పం ఎఫెక్ట్ పడినట్లుందని తమ వాళ్లు అంటున్నారని జగన్ చెప్పుకచ్చారు. ఆసలు ఆయనకున్న కష్టం ఎంటో తనకైతే అర్థంకావడంలేదన్నారు. ఈ చర్చలో చంద్రబాబు కూడా ఉంటే బాగుండేదని జగన్ అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పథకాలు అమలుచేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
ఏపీలో మహిళ సాధికారతలో సువర్ణాధ్యాయం లిఖించామన్నారు ముఖ్యమంత్రి జగన్. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన జగన్ ఆడవాళ్లకు మంచి జరగాలని భావిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. కోటి మంది మహిళలకు సున్నా వడ్డీ పథకం ఇచ్చామని తెలిపారు. మహిళలకు ఆక్సిజన్‌గా వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా అక్కాచెల్లెళ్లకు అమ్మ ఒడి నిధులు అందిస్తున్నామని గుర్తు చేశారు.