AP CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలి.. ఇక చేయాల్సిందల్లా..

AP CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175స్థానాలు సాధించాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Update: 2022-06-08 13:51 GMT

AP CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలి.. ఇక చేయాల్సిందల్లా..

AP CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175స్థానాలు సాధించాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇది ఏమాత్రం కష్టం కాదని చెప్పారు ఆయన. అనుకున్న విధంగా ముందుకెళ్తే 175 స్ధానాలు సాధించగలుగుతామని మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లకు తెలిపారు.

వైసీపీ చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌షాప్‌ నిర్వహించిన సీఎం జగన్‌ దాదాపు ఈ కార్యక్రమం 8 నెలలపాటు కొనసాగించాలన్నారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజలు కేటాయించాలన్నారు. నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడప గడపకూ కార్యక్రమం కొనసాగించాలన్నారు.

గడప గడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం..? ఎలా చేస్తున్నాం..? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి..? ఎలా సమర్థత పెంచుకోవాలని..? అనే విశయంపై కూడా నిరంతరంగా చర్చించుకోవాలన్నారు. అందుకోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. ఇక చేయాల్సిందల్లా ప్రజల మద్దతును నేతలు తీసుకోవడమేనన్నారు జగన్. 

Tags:    

Similar News