త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

AP Cabinet Expansion: ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Update: 2022-03-11 10:22 GMT

త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

AP Cabinet Expansion: ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పదవులు లేనివారు పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. మరోవైపు త్వరలో మంత్రివర్గ విస్తరణ ప్రకటనతో ఆశావాహులు ఉత్సాహం పెరిగింది. పదవుల నుంచి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది మాత్రమే కేబినేట్‌లో ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు.

జిల్లాకో మంత్రి ఉండేలా మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని సమాచారం. ఈ నేపధ్యంలో కేబినేట్లో ఎవరెవరు ఉంటారు.? ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రాంతం, కులాల సమీకరణల ఆధారంగా కేబినెట్‌ విస్తరణ ఉంటుందని జగన్‌ పేర్కొన్నారు. చాలా మంది ఆశావాహులున్నారని, మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన డిమోషన్లుగా భావించొద్దని తెలిపారు.

Tags:    

Similar News