కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌.. కాపు మహిళలకు శుభవార్త

Update: 2019-11-27 11:06 GMT
జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద వంద శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్ అలాగే జగనన్న వసతి కింద విద్యార్ధులకు ఆర్ధిక సాయం చేయనున్నట్లు తెలిపారు. విద్యాదీవెనకు 3వేల 400కోట్లు వసతి దీవెనకు 2వేల 300కోట్లు కేటాయించామన్నారు. ఇక, వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45ఏళ్లు నిండిన కాపు మహిళలకు ఏటా 15వేల ఆర్ధికసాయం చేస్తామన్నారు. కాపు నేస్తం పథకం కింద ఈ ఏడాది 11వందల కోట్లు అందజేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు:

వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి రూ.1,101కోట్ల కేటాయింపు

కాపు సామాజిక మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం

45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు సాయం

రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్న కాపులకు వైఎస్సార్‌ కాపు నేస్తం వర్తింపు

పది ఎకరాల మాగాణి, 25ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు

ట్రాక్టర్‌, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు

టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19నుంచి 29కి పెంచుతూ నిర్ణయం

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం

ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ

ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌కు నిర్ణయం

జగనన్న వసతి పథకానికి కేబినెట్‌ ఆమోదం​.రెండు విడతలుగా జగనన్న వసతి దీవెన, రూ.2,300 కేటాయింపు

ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు

డిగ్రీ, ఉన్నత విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం

కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం.

3.295 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.

ఇనుప ఖనిజం సరఫరాపై ఎన్‌ఎండీసీతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రుణాలు

మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం

ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం రూ.3,400 కోట్లు కేటాయింపు

రూ.225లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి విద్యాదీవెన వర్తింపు

సీపీఎస్‌ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్‌ కమిటీకి ఆమోదం

గిరిజన ప్రాంతాల్లో ఆశావర్కర్ల జీతం రూ. 400 నుంచి రూ.4వేలకు పెంపు.

Tags:    

Similar News