మాది రెండు పేజీల మ్యానిఫెస్టో: సీఎం జగన్

Update: 2020-12-03 08:45 GMT

చంద్రబాబు నాయుడు సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు పెన్షన్ పెంచారని అది కూడా ఒక వెయ్యి రూపాయలు మాత్రమేనని సీఎం జగన్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన నెల నుంచే అర్హులందరికి నెలకు రెండు వేల రెండు వందల యాబై రూపాయలకు ఇస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో 44 లక్షల మంది ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 61లక్షలకు పెరిగారని జగన్ వెల్లడించారు. ఎన్నికలు దగ్గరకు వస్తేనే ప్రజలు గుర్తొస్తారని గెలిచిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

తమది రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమేనని అందులోనూ చెప్పినవన్నీ అమలు చేసి తీరుతామన్నారు సీఎం జగన్. అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చల కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తాను పాదయాత్రలో చూసిన ప్రజల బాధలనే సంక్షేమ పథకాలుగా రూపొందించామన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగానే పేదలకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను క్రమంగా పెంచుకుంటూ పోతామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను మూడు వేల వరకు పెంచుకుంటూ పోతామని వెల్లడించారు.

Tags:    

Similar News