X Ray is Enough for Corona Confirmation: ఎక్స్‌రేతో క‌రోనా ప్రాథ‌మిక‌ నిర్థార‌ణ‌

x ray is enough for corona confirmation: దేశంలోని ప్ర‌తి రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌మ్మేసింది.ప‌ల్లె, ప‌ట్టణం అనే తేడా లేకుండా వైర‌స్ విస్త‌రించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Update: 2020-07-23 12:36 GMT
andhra pradesh special officer dr prabhakar reddy says x ray is enough for corona confirmation

X Ray is Enough for Corona Confirmation: దేశంలోని ప్ర‌తి రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌మ్మేసింది.ప‌ల్లె, ప‌ట్టణం అనే తేడా లేకుండా వైర‌స్ విస్త‌రించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నెల రోజుల క్రితం వ‌ర‌కు ప‌దుల సంఖ్యలో  న‌మోదయిన కేసులు ఇప్పుడు వెయ్యిల‌ సంఖ్యలో న‌మోదవుతున్నాయి. ఈ సంద‌ర్భంలో కోవిద్-19 ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషలాఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...  కరోనా పాజిటివ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎక్స్ రే చాలని అన్నారు. కానీ,ప్రైవేట్ వైద్యులు పెద్ద ఎత్తున సిటీ స్కాన్ కు రిఫర్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు డిమాండ్ పెరిగిపోయింద‌ని. క‌రోనా పాజిటివ్ ఉందా లేదా అని తెలుసుకోవ‌డానికి కేవ‌లం ఎక్స్ రే చాలనీ, ఒకవేళ పాజిటివ్ అని తేలితే అప్పుడు ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఒకవేళ ఎక్స్ రే లో నెగటివ్ వస్తే కరోనా టెస్ట్ అవసరం లేదని తెలిపారు.

ప్రస్తుతం పొరుగు రాష్ట్ర‌మైన మహారాష్ట్రలో మొదట ఎక్స్ రే, తర్వాతనే క‌రోనా టెస్ట్ చేస్తున్నారు. ఈ విధానం మన రాష్ట్రంలో కుడా అవలంభిస్తే చాలా మంచిది. దీనివల్ల కోవిద్ టెస్టుల కోసం ప్రజల నుంచి ఒత్తిడి భారీగా తగ్గుతుందని డాక్టర్ ప్రభాకర్ స్పష్టంచేశారు. అన‌వ‌స‌రంగా సిటీ స్కాన్ ల కోసం డబ్బులు ఖర్చు చేయొద్దు. సిటీ స్కాన్, ఎక్స్ రే రెండు కూడా కోవిడ్ విషయంలో ఒకే ఫలితాలు ఇస్తాయని, సిటీ స్కాన్ ల పేరుతో జరుగుతున్న దోపిడీని ప్ర‌భుత్వం నియంత్రించాలని డాక్టర్ ప్రభాకర్ సూచించారు.

గడిచిన 24 గంటల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 6,045 మందికి కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఇందులో 31,763 యాక్టివ్ కేసులు ఉండగా.. 32,127 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 823కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 6,494 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 65 మంది మృతి చెందారు.

Tags:    

Similar News