ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రంగులు వద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

పంచాయతీ కార్యాలయాలకు ఏ పార్టీ రంగులు ఉండరాదని హై కోర్టు స్పష్టం చేసింది

Update: 2020-01-27 13:40 GMT
AP HIGH COURT FILE PHOTO

పంచాయతీ కార్యాలయాలకు ఏ పార్టీ రంగులు ఉండరాదని హై కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే రంగులు తొలగించాలని ఆదేశించింది. ఈ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోవాలని హై కోర్టు సూచించింది.

ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను హై కోర్టు విచారించింది. పంచాయతీ ఆఫీసులపై ఏ పార్టీ గుర్తులు ఉండరాదని తేల్చిచెప్పింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి అయిదుకు వేసింది.

Tags:    

Similar News